CM Chandrababu: రఘురామ నైజం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 03:57 PM
రఘురామ ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: పారిశ్రామిక వేత్తగా, రాజకీయ వేత్తగా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు (Raghu Rama Krishnam Raju) గుర్తింపు తెచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) ఆయన బాధ్యతలు స్వీకరించారు. సభలో డిప్యూటీ సీఎం ప్రకటన సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రఘురామపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రఘురామకు కల్మషం ఉండదు...
‘‘విశాఖపట్నంలో గల ఆంధ్రాయూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేశారని.. డిస్టెన్షన్‌లో రఘురామ పాస్ అయ్యారు. ఎడిబుల్ ఆయిల్‌లో కూడా ఆయన వ్యాపారం చేశారు. అప్పట్లో సిరీస్ ఫార్మాను ఆయన స్ధాపించారు. డిప్యూటీ స్పీకర్ 2019లో నరసాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఏదైనా ఫ్రాంక్‌గా రఘురామ మాట్లాడుతారు. కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అదే రఘరామకు ఇబ్బందులు తెచ్చింది. జగన్ ప్రభుత్వం ఏపీలో టెర్రరిజన్ని స్పాన్సర్ చేసింది. అధినేత నిర్ణయాలతో విభేదించినప్పుడు కావాలంటే పార్టీకి దూరంగా ఉంటారు. అయితే రఘురామపై జగన్ ఏవిధంగా కుట్రపన్నారో చూశాం.ముందు బెదిరించారు తర్వాత బయపెట్టారు. ఏకపక్షంగా తన సొంత ఎంపీపై లేని రాజద్రోహం కేసును నమోదు చేసి 2021మే 14న ఆయన పుట్టిన రోజున అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందాలని అరెస్టు చేశారు. ఒక ఎంపీని పోలీసు కస్టడీలో టార్చర్ చేయడం సీఐలు, ఐపీఎస్ అధికారులు దీనిలో పాల్గొనడం ఇదే దేశంలో మొదటిది, ఆఖరు సంఘటన కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
రఘురామపై విపరీతంగా దాడి చేశారు
‘‘2021మే 14వ తేదీన సుమోటోగా కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో రాజద్రోహం కేసు టీవీ 5, ఏబీఎన్‌తో కలిసి రఘురామ కుట్ర చేశారు అన్నారు. 9 గంటలకు ఫిర్యాదు ఇచ్చి 10 గంటలకు ఎఫ్‌ఐఆర్ చేసి 2 గంటలకు హైదరాబాద్ వచ్చి రఘురామను అరెస్టు చేశారు. జగన్ హయాంలో శుక్రవారం వస్తే ఎక్కడికక్కడ కూల్చివేతలు, అరెస్టులు చేశారు. గుంటూరు సీఐడీ ఆఫీసులో అయిదుగురు ముసుగులో వచ్చి రఘురామపై విపరీతంగా దాడి చేశారు. కాళ్లు కట్టి లాఠీలు, రబ్బర్ బెల్ట్‌తో ఐదుసార్లు అరికాళ్లపై ఐడెంటిఫై చేయలేని విధంగా కొట్టారు. అప్పటికే ఆయనకు హర్ట్ సర్జరీ అయ్యింది. అలాంటిది ఆయన పడుకున్న మంచంపై.. ఆయన గుండెలపై కూర్చోని హింసించారు. మంచానికి ఉండే కాళ్లు కూడా విరిగిపోయాయి. మామూలుగా సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కూడా లేకుండా పంపించేశారు. రచ్చబండ పెట్టి మాజీ ముఖ్యమత్రి జగన్ బెయిల్ రద్దు చేయమంటావా అన్నారు. సర్కిల్ ఇన్‌స్పెపెక్టర్, హెడ్ కానిస్టేబుళ్లను బయటకు పంపి ముసుగు వేసుకొని వచ్చారు. సాయంత్రం వరకూ కోర్టులో రఘురామ కేసును విచారించకుండా ఆలస్యం చేశారు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు గుంటూరు కోర్టులో విచారణ చేయించారు. కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెబితే.. మళ్లీ కస్టడీకి వస్తావు చంపేస్తామని రఘురామను బెదిరించారు. మేజిస్ట్రేట్ వద్దకు వచ్చాక ధైర్యం చేసి రఘురామ ఆయన కాళ్లు చూపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పంపి రిపోర్టులు ఇవ్వాలని అడిగారు’’ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
రిపోర్టు తారుమారు చేసి జైలుకు పంపించారు..
‘‘ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా రిపోర్టును తారుమారు చేసి రఘురామను జైలుకు పంపారు. ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో కూడా కేసు విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు సమావేశం అయ్యింది. రిపోర్టు అడిగితే సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు. రఘరామను తీసుకురాలేమని పోలీసులు మొరాయించారు. సుప్రీంకోర్టు వేకేషన్ బెంచ్‌లో కేస్ వేశారు. హైదరాబాద్‌లో మిలటరీ ఆస్పత్రికి రఘురామను రిఫర్ చేశారు. అప్పుడు కూడా మోరాయించారు. ఆయనను తరలించకపోతే తెలంగాణ ఛీప్ జస్టిస్ నియమించే న్యాయాధికారి సమక్షంలో పరీక్షలు నిర్వహించి రిపోర్టు ఇవ్వాలన్నారు. మిలటరీ ఆస్పత్రిలో కూడా మభ్యపెట్టే పరిస్ధితి చేశారు. సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరు చెప్పడం లేదు. మూడురోజుల పాటు ట్రీట్‌మెంట్ ఇచ్చాక సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఇచ్చింది. ఇక్కడితో కక్ష ఆగలేదు. నర్సాపూర్ లోక్‌సభ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించారు. విగ్రభా ఆవిష్కరణకు వెళ్లాలనుకుంటే రఘురామను వెళ్లనీయలేదు. ఆయన వెళ్తే పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో రైళ్లను తగులబెట్టాలని కుట్ర చేశారు. నియోజకవర్గానికి ఆయనను రానీయకపోతే చివరకు రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయం చెప్పి వారి ఆదరణ పొందారు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు
Nara Lokesh: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్
For AndhraPradesh News And Telugu News