Home » Tirumala
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం విషయంలో పాత ఆఫ్లైన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.
తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మాత్రమే అనుకున్న విధానాన్ని మార్చి, తిరిగి ఆఫ్లైన్ టోకెన్లు కూడా అందుబాటులోకి తెచ్చింది
శ్రీవారి దర్శనార్ధం వచ్చిన వారిని అలిపిరి భద్రత వలయం వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కొండపైకి అనుమతి ఇస్తారు. అయితే సోమవారం ఉదయం ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చాడు. చెకింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి వాహనాన్ని ఆపకుండా భద్రతా సిబ్బందిని తప్పించుకుని తిరుమలకు వచ్చాడు.
విశ్వావసు నామ సంవత్సర ఉగాది ళసందర్భంగా ఆదివారం తిరుమల కొండ కళకళలాడింది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తిరుమల పాపవినాశనం డ్యాంలో అనధికార బోటింగ్పై అటవీశాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు
తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో పాపవినాశనం డ్యాం ఒకటి. ఈ నీరు పవిత్రమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ నీటిలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు. అలాంటి ఈ డ్యాంలో బోటింగ్ సౌకర్యం ప్రవేశపెడితే ఇది ఒక తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు.
శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులు పరిరక్షించడం, సద్వినియోగపరచడం లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
TTD Board Decisions: టీటీడీ పాలక మండలి ఈరోజు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను టీటీడీ మార్చి 24న విడుదల చేయనుంది. జూన్ నెలలో దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు సోమవారం టికెట్లను బుక్ చేసుకోవల్సి ఉంటుంది.