Papavinasanam Dam: పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌పై సీఎంవోకు టీటీడీ ఫిర్యాదు
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:23 AM
తిరుమల పాపవినాశనం డ్యాంలో అనధికార బోటింగ్‌పై అటవీశాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు

తిరుమల, మార్చి 27(ఆంధ్రజ్యోతి): తిరుమల పాపవినాశనం డ్యాంలో అనధికార బోటింగ్‌పై అటవీశాఖ అధికారుల తీరుపై టీటీడీ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భక్తుల దాహార్తి తీర్చే డ్యాంలో మూడురోజుల క్రితం ఐదుగురు వ్యక్తులు కయాక్ బోట్లలో తిరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎందుకోసం సర్వే నిర్వహించారని ఫారెస్ట్ అఽధికారులను విచారించడంతో పాటు సీఎం కార్యాలయానికి కూడా టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
For More AP News and Telugu News