Home » TS News
హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాగోల్ శుభమ్ కన్వెన్షన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ జరిగింది.
తనకు శత్రువులు ఎవరూ లేరని.. తనపై ఎవరు కుట్ర చేస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నేడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్‌లోని అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చివేశారన్నారు.
ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్లోనే జరగనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమన్నారు.
మహా నగరం హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన ఇల్లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని అన్నారు.
ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసు ట్రయల్‌ని భోపాల్‌కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
చెరువుల కబ్జాలపై రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది.
ప్రియురాలిపై ప్రేమన్మాది కత్తితో దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ దాడి ఘటనలో యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ అనే యువతి నల్లగండ్లలోని అపర్ణలో బ్యుటిషియన్‌గా పని చేస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా కవిత వెళుతున్నారు.
శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులను ఓయో హోటల్ నిర్వాకుడు బెదిరిస్తున్నాడు.