Home » TS News
ఇవాళ్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
మహబూబ్‌నగర్.. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన పిల్లలమర్రి పర్యటక కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు సందర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కౌంటర్లో కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెరువులు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ఈ తరుణంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖా హెచ్చరికల పట్ల నీటి పారుదల శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
క్రెడాయ్ స్టేట్ కాన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ స్టేట్‌కాన్- 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
మంగళవారం తెల్లవారు జామున కురిసిన అతి భారీ వర్షానికి హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయం కావడం.. మంగళవారం వర్కింగ్ డే కావడంతో ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కాలేజీలు వెళ్లే యువతలో అత్యధికులు ‘మెట్రో’ ప్రయాణానికి మొగ్గుచూపారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు అన్ని భారీ రద్దీతో కనిపిస్తున్నాయి. రైళ్లన్నీ ప్రయాణీలకులతో కిక్కిరిసిపోయాయి.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఐదు నెలల క్రితం అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ సీబీఐ,ఈడి కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. కవిత కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది.