Home » TSRTC
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు ఎంతలా విలయం సృష్టించాయో తెలిసింది. విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. కూటమి ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. కాగా ఈ వరద సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.
Telangana: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.నిన్న రాత్రి వరకు 877 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేశారు.
భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం..
ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని, పెండింగ్లో ఉన్న రూ.200 కోట్ల ఆర్పీఎస్ బాండ్ డబ్బులను త్వరలో సిబ్బందికి అందించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం(Arunachalam)లో గిరి ప్రదక్షిణ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో(Hyderabad-2 Depot) ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) జంటనగరాల పరిధిలో 24 సరికొత్త మెట్రో డీలక్స్ బస్సులను(Metro deluxe buses) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వి.వెంకటేశ్వర్లు(Greater Hyderabad ED V.Venkateshwarlu) తెలిపారు.
రాజధాని నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎ్సఆర్టీసీ మరో వారం రోజుల్లో ఎలక్ట్రిక్ (సెమీ లగ్జరీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
టీజీఎ్సఆర్టీసీ పరిస్థితి ‘బస్సులు ఫుల్లు... బాకీలూ ఫుల్లే’ అన్నట్టు తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది.
కొత్త బస్సులు వచ్చాయని, త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హైదరాబాద్ రీజియన్ రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్(Hyderabad Region Regional Manager B. Varaprasad) తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రద్దీ సమయాల్లో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని వివరించారు.