Share News

Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:33 PM

అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..

Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..
BUS Journey

మీరు వారంతాల్లో లేదా పండుగలకు ఊరువెళ్లాలంటే ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. ఆర్టీసీతో సమాన ధరలకే మీరు ఇప్పటివరకు టికెట్లు బుక్ చేసుకున్నారా.. అయితే మీకు ఇది తప్పకుండా బ్యాడ్ న్యూస్. ఇక నుంచి మీ జేబులకు చిల్లు పడనుంది. ఓ వైపు దసరా సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయివేట్ ట్రావెల్స్ టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి. దాదాపు వంద నుంచి రెండు వందల శాతం ధరలను పెంచేశాయి. పండుగకు 10 రోజుల ముందు నుంచే పెరిగిన టికెట్ల ధరలు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు మరింత ఎక్కువుగా ఉండనున్నాయి. అంతేకాదు నవంబర్‌లోనూ బస్సు టికెట్ ధరలు అధికంగా చూపిస్తున్నాయి. ఎటువంటి పండుగలు లేకపోయినా నవంబర్, డిసెంబర్ నెలలో ఏసీ సీటర్ హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.2900 ఉండగా.. స్లీపర్ రూ.3,100 చూపిస్తుంది. ఇదే బస్సులో సెప్టెంబర్ 30వ తేదీన స్లీపర్ టికెట్ ధర రూ.1200 ఉండగా నవంబర్, డిసెంబర్‌లో దాదాపు రూ.3,000 చూపిస్తుంది. ఇదే బస్సులో అక్టోబర్ 1న స్లీపర్ టికెట్ రూ.1400 చూపిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ప్రయివేట్ ట్రావెల్స్‌ బస్సు టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి.

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్


వ్యత్యాసం ఇదే..

హైదరాబాద్ నుంచి యానం, హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ధరలు సరాసరి సెప్టెంబర్ 30వ తేదీన నాన్ ఏసీ టికెట్ రూ.800 నుంచి 1500 వరకు ఉండగా.. అక్టోబర్ ఒకటి నుంచి ఒక్కో టికెట్‌పై రెండు వందల నుంచి ఐదు వందల వరకు పెరగనుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు ఒక్కో టికెట్‌పై రూ.300 నుంచి 500 వరకు పెరగనుంది. ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ బస్సులో అక్టోబర్ 5వ తేదీన ఏసీ స్లీపర్ టికెట్ రూ.1500 నుంచి రూ.1700 ఉండగాఅదే తేదీన ప్రయివేట్ ట్రావెల్స్‌లో స్లీపర్ టికెట్ ధర రూ.3వేల వరకు ఉంది. ప్రధానంగా దసరా పండుగ నేపథ్యంలో బస్సు టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఓవైపు రైలు టికెట్లు ఖాళీ లేకపోవడం, స్పెషల్ ట్రైన్స్‌లో టికెట్లు మొత్తం బుక్ కావడంతో తప్పుకుండా ప్రయాణం చేయాల్సిన వ్యక్తులు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సులు పరిమిత సంఖ్యలో ఉండటంతో ఇక ప్రయివేట్ ట్రావెల్స్‌లోనే ప్రయాణం చేయడం అనివార్యం కావడంతో బస్సు టికెట్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్


వరుస సెలవులు కావడంతో..

అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో ట్రైన్, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఫుల్ కావడంతో ప్రయివేట్ ట్రావెల్స్ టికెట్ల ధరలను పెంచేశాయి. అక్టోబర్ 15 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని, ఆ తరువాత రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది.


Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 30 , 2024 | 04:33 PM