Home » Uppal
భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్లో రాబరికి యత్నించారు.
ఉప్పల్ నియోజకవర్గం(Uppal Constituency)లో శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. గతేడాది నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని ఆరు నియోజకవర్గాలతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ ఆదిక్యతను ఇచ్చిన నగర ఓటర్లు లోక్సభ ఎన్నికలు వచ్చే సరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కొడుకు తన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు నిరసనకు దిగింది.
హైదరాబాద్ ఉప్పల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. క్రికెట్ ఆటలో జరిగిన ఓ గొడవ నేపథ్యంలో రాడ్లు, కర్రలతో యువకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ నేతతో సహా ఏడుగురిపై దాడి చేయడంతో వారంతా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్లో ఆరో మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్(Uppal)లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనుంది.
లోక్సభ ఎన్నికల పోలింగ్కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.
క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..
ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్(IPL match)ను పురస్కరించుకుని ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.