Home » Uttar Pradesh
భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే ఇవాల్డి భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పేందుకు భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల వివాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తొలుత ఈ మాటల యుద్ధానికి అఖిలేష్ తెరతీయగా, దేనికైనా దమ్ముండాలంటూ యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లా ప్రజలను తోడేళ్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై దాడి చేసి వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పులులో.. చిరుతలో కాదు..! ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలన్నరలోనే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నాయి..
గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది.
నగదు బదిలీ కాస్తా ఆలస్యమయ్యే సరికి ఓ నిండి ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వారోగ్య శాఖ విభాగంలో ఆదిత్యవర్ధన్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సహచర ఉన్నతాధికారులతో కలిసి ఆయన కన్పూర్ సమీపంలోని నానామౌ ఘాట్లో స్నానం చేసేందుకు గంగానదిలో దిగారు.
ఇళ్లు, వాటర్ ట్యాంకులు, బావులు తదితర ప్రదేశాల్లో వింత వింత శబ్ధాలు రావడం, ఏముందా అని చూస్తే షాకింగ్ సీన్లు కనిపించడం చూస్తుంటాం. కొన్నిసార్లు మరీ విచిత్రంగా ఏవోవే వింత వింత జీవులు కనిపిస్తుంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ చర్యలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సూర్యప్రతాప్ షాహీ కొనియాడారు.
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కోత్వాలీ కాయమ్గంజ్ ప్రాంతంలోని భగౌతిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఇద్దరు బాలికలు జన్మాష్టమి సందర్భంగా గుడికి బయలుదేరినట్టు తెలుస్తోంది.
ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమని, విడిపోతే జరిగేది వినాశనమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. కొన్ని వారాలుగా హింసాత్మక నిరసనలు అట్టుడకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బలవంతంగా దేశం విడిచిపెట్టిన వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.