Mahakumbh: 26న చిట్టచివరి స్నాన ఘట్టం... హై అలర్ట్
ABN , Publish Date - Feb 18 , 2025 | 09:22 PM
ఈనెల 26వ తేదీతో కుంభమేళా ఆధ్యాత్మిక సంబరం ముగియనుండటం, అదే రోజు చివరి షాహి స్నాన్ (పవిత్ర స్నానం) కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా సిబ్బందిని మోహరిస్తున్నారు.

మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతున్న కుంభమేళా (Kumbha Mela) మరి కొద్దిరోజుల్లో చివరి ఘట్టానికి చేరుకుంటోంది. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఫిబ్రవరి 26వ తేదీ నాటికి ఈ సంఖ్యం 60 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో 26వ తేదీతో ఆధ్యాత్మిక సంబరం ముగియనుండటం, అదే రోజు చివరి షాహి స్నాన్ (పవిత్ర స్నానం) కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా సిబ్బందిని మోహరిస్తున్నారు.
Maha Kumbh Mela Extension: మహా కుంభమేళా తేదీ పొడిగిస్తున్నారా.. అధికారుల క్లారిటీ..
కుంభమేళా చివరి రోజున 'షాహి స్నాన్' కు పెద్ద సంఖ్యంలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేసినట్టు మహాకుంభ్ డీజీఐ వైభవ్ కృష్ణ తెలిపారు. నవంబర్ 26న అన్ని సున్నితమైన ప్రాంతాల్లోనూ అదనపు పోలీసు బలగాలను మోహరిస్తు్న్నామని చెప్పారు. ఒకవేళ ఏదైనా పరీక్షా కేంద్రం సమీపంలో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ ఉంటే, విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. రెగ్యులర్ రూట్లలోనే భక్తులను అనుమతిస్తామని వివరించారు.
కాగా, ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ భద్రతా ఏర్పాట్లను సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ స్వయంగా సమీక్షించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఇతర ఏజెన్సీల చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్
Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.