Home » Uttar Pradesh
1990వ దశకంలో సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదలైన చిత్రం తాజ్‌మహల్. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్.. హీరోయిన్ మౌనికా బేడిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమంటే ఇష్టం లేని హీరో శ్రీకాంత్ తండ్రి రంగనాథ్‌తోపాటు ఆయన స్నేహితుడు, పోలీస్ అధికారి కోట శ్రీనివాసరావు.. గ్యాంగిస్టర్ శ్రీహరిని కలుస్తారు. మౌనిక బేడిని హత్య చేసేందుకు ఒప్పందం చేసుకుంటారు.
స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్ కోసం త్యాగాలు చేసే వారిని సినిమాల్లోనే చూసి ఉంటాం. అలాంటి ఘటన ఒకటి నిజజీవితంలో జరిగింది. తన గర్ల్‌ఫ్రెండ్ ఆశ తీర్చాలనుకున్నాడు ఓ ప్రియుడు. ఆమెకు కొత్త కార్లో షికారుకు వెళ్లాలని ఉన్నట్లు తెలిసి.. డోంట్ వర్రీ అంటూ అతని స్నేహితులు అభయ హస్తం ఇచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలో వరద నీరు ప్రవహించింది.
వివాహమైన మూడేళ్లకు భర్తను కుటుంబాన్ని వదిలి ప్రియుడి వద్దకు ఓ యువతి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం ఏమి తెలియని ఆ యవతి కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను ఏదో చేసి మాయం చేశాంటూ.. ఆమె అత్తవారింటి మీద పోలీస్ కేసు పెట్టారు. తమకు ఏ పాపం తెలియదంటూ.. తన భార్యను పుట్టింటి వారే ఏదో చేశారంటూ అతడు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా ఇటీవల వివిధ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు రైల్వే బోర్డు తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మరోవైపు రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ బండలు, సిమెంట్ దిమ్మలు, ఐరన్ రాడ్లు వేస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
‘టైం మెషిన్’ ద్వారా అనుకుంటే వెనుకటి కాలానికి, ముందు కాలానికీ వెళ్లొచ్చు! ఈ కథాంశంతో 90లో సినిమా వస్తే తెరమీద ఆ మాయాజాలానికి మైమరిచిపోయి భూత, భవిష్యత్తు కాలాల్లో మనమూ ప్రయాణించి మురిసిపోయాం!
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్‌కు తీవ్ర ఆందోళన చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
ప్రజాస్వామ్య దేశాల్లో జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తోన్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలెట్ గోవిందపురి స్టేషన్ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు.