Share News

CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం.. ఏం వెరైటీలు తిన్నారో తెలుసా

ABN , Publish Date - Apr 06 , 2025 | 06:07 PM

భద్రాది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు ఆరా తీశారు.

CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం.. ఏం వెరైటీలు తిన్నారో తెలుసా
CM Revanth Reddy

భద్రాది కొత్తగూడెం: జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా ఇవాళ (ఆదివారం) భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేడుక అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో పర్యటించారు. అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి.


భూరం శ్రీనివాసరావు అనే లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో కలిసి ఆయన భోజనం చేశారు. ముందుగా రేవంత్ రెడ్డికి స్థానిక మహిళలు మంగళహారతులు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం సదరు కుటుంబంతో కలిసి భోజనం చేశారు సీఎం. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు.


దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండడంతో కుటుంబానికి ఉపయోగకరంగా ఉందని సీఎం ఎదుట శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారితో ఫొటోలు దిగిన రేవంత్ రెడ్డి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున సారపాక గ్రామానికి చేరుకున్నారు. తమ అభిమాన నేతను చూసి సంతోషం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

KTR Letter: కంచె గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ.. కాంగ్రెస్‌కు మాస్ వార్నింగ్..

Sri Rama Navami Tragedy: ఘోర ప్రమాదం.. సీతారాముల కల్యాణం జరుగుతుండగా..

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Updated Date - Apr 06 , 2025 | 06:13 PM