Share News

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:56 PM

Brinjal Soup: వంకాయ సూప్ తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇవి తాగడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతోంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ సూప్‌ను ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు.

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Vankaya Soup

సూప్‌ల్లో చాలా రకాలుంటాయి. వాటిలో ఒకటి వంకాయ సూప్. ఇది తయారు చేసుకొంటే సాధారణంగా ఉంటుంది. కానీ ఈ సూప్ తయారు చేసే క్రమంలో కొన్ని కూరగాయాలను కలిపితే.. అది మరింత రుచికరంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు..

వంకాయలు (మీడియం సైజ్): 2

టొమాటోలు (ముక్కలుగా కట్ చేసినవి): 2

ఉల్లిపాయ (సన్నగా తరిగినవి): 1

వెల్లుల్లి (తరిగినవి): 3 నుంచి 4 రెబ్బలు

క్యారెట్ (చిన్న ముక్కలుగా తరగాలి): 1

ఉప్పు: రుచికి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది

మిరియాల పొడి: 1/2 టీ స్పూన్

జీలకర్ర పొడి (రుచి కోసం) : 1/4 టీ స్పఊన్

ఆలివ్ ఆయిల్ లేదా వెన్న పూస: 1 టేబుల్ స్పూన్

కొబ్బరి పాలు : 2 టేబుల్ స్పూన్లు

నీరు లేదా వెజిటబుల్ స్టాక్: 3 నుంచి 4 కప్పులు

కొత్తిమీర: కొద్దిగా.. అంతా పూర్తయిన తర్వాత కొద్దిగా వేయాలి


సూప్ ఇలా తయారు..

వంకాయలను సిద్ధం చేయండి. వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత సన్నగా కట్ చేసి.. ఓవెన్‌లో 200 డిగ్రీ సెంటిగ్రేట్ వద్ద 20 నుంచి 25 నిమిషాలు గ్రిల్ చేయాలి. లేదా గ్యాస్ మీద కాల్చాలి. ఇలా చేయడం వల్ల వంకాయలకు స్మోకీ రుచి వస్తుంది. అంతేకాదు. ఇది సూప్‌కు ప్రత్యేక రుచిని ఇస్తుంది. కాల్చిన తర్వాత చర్మాన్ని తీసేసి.. గుజ్జును ఒక గిన్నెలో ఉంచాలి.

కూరగాయలను వేయించాలి..

ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ లేదా వెన్న వేసి..వెల్లుల్లి, ఉల్లిపాయలను లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇది సూప్‌ రుచికి మరింత దోహదం చేస్తోంది. ఇక టొమాటోలు, క్యారెట్‌లు వేసి 5 నిమిషాలు ఆవిరిపై ఉంచండి.


సూప్ ఉడకబెట్టాలి:

కాల్చిన వంకాయ గుజ్జును పాన్‌లో వేసి.. 3 నుంచి 4 కప్పుల నీరు లేదా వెజిటబుల్ స్టాక్ జోడించండి. ఉప్పు, మిరాయల పొడితోపాటు జీలకర్ర పొడి వేసి.. మీడియం మంట సెగపై 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. కూరగాయలు మెత్తబడిన తర్వాత గ్యాస్ మంటను ఆపండి.

మెత్తగా చేయాలి:

ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారిన తర్వాత.. గ్రైండర్‌లో వేసి మెత్తగా చేయాలి. రుచి కోసం 2 టేబుల్ స్పూన్లు తాజాగా కొబ్బరి పాలు వాటిలో వేయండి. ఇది మంచి రుచిని ఇస్తుంది.


అనంతరం వడ్డించుకోవడమే..

వేడిగా ఉన్న సూప్‌ను గిన్నెలో పోసి.. కొత్తిమీర వేసుకోవాలి. గార్లిక్ బ్రెడ్ లేదా క్రౌటన్స్‌తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.

రుచి కోసం ఈ టిప్స్ ఫాలో కాావాలి..

  • మసాలా టచ్: ఒక చిటికెడ్ గరం మసాలా వేస్తే.. రుచి మరింత పెరుగుతోంది.

  • కొబ్బరి పాలు లేదా బాదం పాలు వీటిలో వాడితే.. రుచితోపాటు ఆరోగ్యం రెండూ సమతుల్యంగా ఉంటాయి.


వంకాయ సూప్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

  • తక్కువ కేలరీలు, బరువు తగ్గడం..

  • అసలు వంకాయలో కేలరీలు తక్కువ (100 గ్రాములకు 25 కేలరీలు). వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

  • సూప్ రూపంలో తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది.

  • బరువు తగ్గడానికి సహాయ పడుతోంది.

ఫైబర్ అధికం..

వంకాయ, క్యారెట్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తోంది. మబద్దకాన్ని నివారిస్తోంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతోంది.


యాంటీఆక్సిడెంట్లు:

వంకాయలో నాసునిన్ (Nasunin) అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడు కణాలను రక్షిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రిస్తుంది. టొమాటోల ఉండే లైకోపీన్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.

రక్తపోటు నియంత్రణ:

వంకాయలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది. హైపర్ టెన్షన్ రిస్క్‌ను నియంత్రిస్తుంది.


హైడ్రేషన్:

సూప్‌లో నీరు లేదా స్టాక్ ఉండడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్నికి, శక్తి స్థాయిలకు ఉపయోగపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గింపు:

వంకాయలో క్లోరోజెనిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల నివారణకు దోహదపడుతుంది.


రోగనిరోధక శక్తి:

విటమిన్ సి (టొమాటో).. విటమిన్ కె (వంకాయ) రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రక్తం గడ్డకట్టడానికి దోహదపడుతోంది.

జాగ్రత్తలు:

  • వంకాయలను బాగా ఉడికించాలి. ఎందుకంటే పచ్చిగా లేదా సరిగ్గా ఉడకకపోతే.. జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

  • అలర్జీ సమస్యతో బాధపడేవారు, కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారు మితంగా తీసుకోవాలి.

    మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 06:49 PM