Home » Vemuri Radhakrishna
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేటి (బుధవారం) ‘బిగ్ డిబేట్’ చర్చలో గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్కే గారూ సంధిస్తున్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఏబీఎన్ బిగ్ డిబేట్’లో బీజేపీ నేత, అనకాపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి వైఎస్ వివేకా హత్య ఈ ఎఫెక్ట్‌తో కడపలో వైఎస్ షర్మిల గెలుస్తుందా అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘వైఎస్ షర్మిల గెలుస్తారో లేదో తెలియదు. కానీ షర్మిల, సునీత చెప్పేదానివల్ల జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది’’ అని అన్నారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు. నేటి (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ పాల్గొన్నారు. రాధాకృష్ణ గారు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. లైవ్‌లో ఈ చర్చా కార్యక్రమాన్ని వీక్షించండి.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 30 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాల్సి ఉండేదని వివరించారు. 1998లో చిత్తూరు నుంచి పోటీ చేయాలని, చివరి క్షణంలో టికెట్ చేజారిందని గుర్తుచేశారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేడు (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ (CM RAMESH) వచ్చారు.
తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోంది. పులి మీద పుట్రలా ఎన్నికల ముంగిట ఈ తలపోటు ఏమిటా? అని కలవరపడుతోంది. అధికారం ఉపయోగించి చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడిని ముప్పుతిప్పలు పెడుతున్నామని సంతోషిస్తున్న వేళ...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. 29 మంది ఐపీఎస్ అధికారులు కావాలని హోం మంత్రి అమిత్ షాను అడిగానని సీఎం రేవంత్ తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతం ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్‌ను చూసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముగ్గురితో కంపేర్ చేసిన సమయంలో బాధ్యత ఉంది, ఆకాంక్ష కూడా ఉందన్నారు. ఏం చేయకుండా ఉండి, ఇంట్లో పడుకుంటే నడిచిపోతుందని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. సీఎంగా మంచి మార్కులే వచ్చాయని రాధాకృష్ణ అనడంతో ఢిల్లీలో ఇతర పార్టీల నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం రేవంత్ సమాదానం ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్ రెడ్డి అని రాధాకృష్ణ ప్రశ్నించారు.