Home » Vijayawada
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాపేజీలను కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వలను జారీ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఐఐటీ మెడికల్ అకాడమీ మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని అంటున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని ఐరన్ ఓర్ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టేసింది.
గన్నవరంలో తనపై నమోదైన రెండు కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆశ్రయించారు. ఆ మేరకు ధర్మాసనం విచారణ చేపట్టగా ఇరువర్గాల తమ వాదనలు వినిపించాయి.
పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గించే కుట్ర బీజేపీ చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని చెప్పారు.
మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు.
శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది.
కాకినాడ సీ పోర్టు ప్రైవేటు లిమిటెడ్ ‘వ్యవహారం’లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డే సూత్రధారని మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు.
YSRCP leaders protest: విజయవాడలో కలెక్టరేట్ ముట్టడి పేరుతో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీసులకు తోసుకుని మరీ కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు వైసీపీ శ్రేణులు.