Share News

Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

ABN , Publish Date - Feb 17 , 2025 | 10:10 AM

విజయనగరం జిల్లా: రాజాం మండలం, బొమ్మినాయుడువలసలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడంతో ఇరు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి.

Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
TDP vs YSRCP

విజయనగరం జిల్లా: రాజాం మండలం (Rajam Mandal), బొమ్మినాయుడువలసలో ఉద్రిక్తత (Tension) నెలకొంది. టీడీపీ (TDP), వైఎస్సార్‌సీపీ (YSRCP) వర్గాల ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడంతో ఇరు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి. కాగా ఆదివారం రాత్రి భూ వివాదాలతో (Land Disputes) ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో గాయపడినవారు రాజాంలోని ఆస్పత్పిలో చికిత్స పొందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో పికేటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..


ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి మురళీ ఆధ్వర్యంలో నియోజవర్గం అభివృద్ధి చెందుతుందనే భావంతో టీడీపీలో చేరామని.. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తమను ఇబ్బందులు పెడుతున్నారని.. ఈ క్రమంలో రాత్రి తమపై దాడులు చేసి కొట్టారని, రాజాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నామని చెప్పాడు. వైఎస్సార్‌సీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. వారికి భయపడి 20 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నామని, వ్వవసాయ పనులకు కూడా వెళ్లలేకపోతున్నామని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి జైలులో భద్రత

భక్త జనసంద్రంగా మారిన పెద్దగట్టు

ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

ఉప్పల్‌లో 9 వైజాగ్‌లో 2

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 17 , 2025 | 10:10 AM