Home » YS Jagan
నాడు అసెంబ్లీకి రానంటే రానని ప్రగల్భాలు పలికారు.. నేడు సభ్యత్వం రద్దు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు.. మరి సభకు వచ్చిన ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రస్తావించారా? అంటే ఛాన్సే లేదు.
AP Assembly Budget Session: అధికార టీడీపీ సభ్యులు అందరూ ఈసారి నేరుగా సభకు వచ్చే అవకాశముందని సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ సారి వెంకటపాలెంలోని వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహనికి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ఎమ్మె్ల్యేలంతా నివాళులు అర్పించే కార్యక్రమంపై తీవ్ర సంగ్ధిద్దత నెలకొంది.
గేట్ నెం. 1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సభాపతి, డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు. అలాగే ప్రతిపక్ష నేత కూడా వస్తారు. అయితే జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు.. అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుపట్టారు. గేట్ నెం. 2 నుంచి మంత్రులు వస్తారు. గేట్ నెం. 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలకు రావాలి. మరి జగన్..
ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరు కానున్నారు.
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆయనకు ఇంటిపోరు అధికమైందని అంటుంది. అధికర పార్టీ ఇచ్చే కౌంటర్‌కు తమ పార్టీలో ఎన్కౌంటర్ ఇచ్చే వారే కరువయ్యారని చెబుతోంది.
YS Sharmila: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైఎస్ జగన్.. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అదికూడా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
Somireddy Chandra Mohan Reddy: మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ల అందాలు వైఎస్ జగన్ ఎప్పుడు చూశాడంటూ మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కంటే వైఎస్ అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడని వైసీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు వచ్చారు. మిర్చి యార్డ్‌కు వెళ్లారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, పర్యటన వద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు పర్యటనకు రానున్నారు. అక్కడ మిర్చియార్డులో రైతులను పరామర్శించనున్నారు. వారి సమస్యలను అడిగితెలుసుకోనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను, నాయకులను బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు.