YSRCP: జగన్ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి..
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:55 PM
నాడు అసెంబ్లీకి రానంటే రానని ప్రగల్భాలు పలికారు.. నేడు సభ్యత్వం రద్దు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు.. మరి సభకు వచ్చిన ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రస్తావించారా? అంటే ఛాన్సే లేదు.

అమరావతి, ఫిబ్రవరి 24: నాడు అసెంబ్లీకి రానంటే రానని ప్రగల్భాలు పలికారు.. నేడు సభ్యత్వం రద్దు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు.. మరి సభకు వచ్చిన ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను ప్రస్తావించారా? అంటే ఛాన్సే లేదు. పైగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే నీచ ప్రయత్నం చేశారు. పట్టుమని ఐదు నిమిషాలు కూడా సభలో కూర్చొకుండా పారిపోయారు. ఇంకెవరు ఆయనే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్. అంతేకాదండోయ్.. ఇప్పుడు మళ్లీ పాత పాటే అందుకున్నారు. చిన్న పిల్లలు నాకు చాక్లెట్ ఇస్తేనే బడికి పోతా అన్నట్లు.. జగన్ సైతం ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ లాజిక్కు లేని రీజన్‌తో సభకు డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందోనని భయంతో అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్.. ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష హోదా పేరుతో చిల్లర రాజకీయానికి తెరలేపారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక ప్రకటన చేశారు జగన్. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించారు. అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటం సాగిద్దామని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
అంతేకాదండోయ్.. తాను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన జగన్.. తన ‘30 ఏళ్ల’ ఫ్యాంటసీని మరోసారి బయటపెట్టారు. తనతో పాటు ఉండేవాళ్లే తన వాళ్లు అని పేర్కొన్నారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం వుందని సమాచారం అందుతోందన్న జగన్.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని వైసీపీ నేతలు జగన్ వద్ద ప్రస్తవించగా.. పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడం కుదరదని అన్నారు. ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే బాధిత ప్రజలకు అండగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు జగన్.
Also Read:
ప్రతిపక్ష హోదా కావాలా.. జగన్‌కు ఇచ్చిపడేశారుగా..
తునిలో వైసీపీ కొత్త నాటకం.. ఏం చేశారంటే..
ఆ భయం వల్లే.. ఎంపీ అవినాష్ హాట్ కామెంట్స్
For More Andhra Pradesh News and Telugu News..