అర్హులైన రైతులకు వెంటనే రుణ మాఫీ చేయాలని, సన్నరకం ధాన్యానికి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని కోరుతూ దండేపల్లిలో ఎల్లయ్యపల్లెలో రైతులతో కలిసి బీజేపీ నాయకులు బుధవారం రాస్తారోకో చేపట్టారు.
రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
మంచిర్యాల, మార్చి11 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారు లకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దు కాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నాయి. ప్రతి నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రేషన్ షాపుల్లో బి య్యం పోయాల్సి ఉంది. అయితే 12వ తేది వచ్చిన ప్పటికీ ఇంకా దాదాపు 40శాతం మేరక స్టాక్ చేరుకో కపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
జైపూర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి రోజువారీ మెనును అడిగి తెలుసుకున్నారు.
జన్నారం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభు త్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో 97 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, ఐదుగురికి షాదిముబారక్ చెక్కు లను పంపిణీ చేశారు.
సీసీసీలోని జనావాసాల మధ్య ఉన్న డంప్యార్డును అక్కడి నుంచి తరలించాలని సింగరేణి ఉద్యోగులు ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణుకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల క్వా ర్లర్ట మధ్యలోని ముక్కిడి పోచమ్మ ఆలయం వెనుకవైపు డంప్యార్డు ఉండడంతో తీవ్ర దుర్గంధం వస్తోం దని, తరచుగా చెత్తను తగులబెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని తెలిపారు.
ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇలాంటి తరుణంలో మట్టి పనులు చేయటం ఉపాధిహామీ కూలీలకు కష్టసాధ్యమే.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులకు అసౌక ర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధాయ్యుడికి నిర్మల్ జిల్లా పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. నిందితుడుని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు పుట్టుకొచ్చిన ఘటన ఇటీవల దండేపల్లి మండలం అదుగుల పేటలో వెలుగు చూసింది. సర్కారు భూములను అక్రమంగా కట్టబెట్టిన అధికారులు వాటికి లావుణి పట్టాలు జారీ చేశారు. పైగా అసైన్మెంట్ కమిటీ ప్రమేయం లేకుండానే నేరుగా మండల రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడం గమనార్హం.