టీవీ నారాయణ కన్నుమూత
ABN , First Publish Date - 2022-01-12T08:10:49+05:30 IST
ఆర్యసమాజ ఉపాసకుడు, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత తక్కెళ్ల వెంకయ్య నారాయణ (97) ఇక లేరు.

దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి తదితరుల నివాళి
హైదరాబాద్ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆర్యసమాజ ఉపాసకుడు, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత తక్కెళ్ల వెంకయ్య నారాయణ (97) ఇక లేరు. మూడేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో మంచానికే పరిమితమైన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 5న నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. టీవీ నారాయణగా సుపరిచితులైన ఆయన మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి జీవిత భాగస్వామి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సామాజిక, ఆధ్యాత్మిక, విద్యారంగాల్లో నారాయణ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.