వివాహేతర సంబంధం.. దాడి.. కానిస్టేబుల్ సస్పెండ్
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:12 AM
వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె బంధువులపై ఘర్షణకు పాల్పడిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేశారు.

పేరాల(చీరాల), మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె బంధువులపై ఘర్షణకు పాల్పడిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చీరాలకు చెందిన కానిస్టేబుల్ కొంత కాలంగా డీఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతనికి పేరాల్లోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈక్రమంలో గురువారం రాత్రి ఆమె బంధువులతో తీవ్రంగా ఘర్షణ పడి చివరకు దాడులు చేసుకున్నారు. ఈక్రమంలో రెండు వర్గాల వారు ఏరియా హాస్పిటల్‌కు చేరి చికిత్స పొందారు. విచారణ చేపట్టిన అఽధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సస్పెండ్ చేశారు.