పీఆర్సీ ఏర్పాటుచేసి.. ఐఆర్ మంజూరు చేయాలి
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:19 AM
పెన్షనర్ల సమస్యలను తక్షణం పరిష్కరించడంతో పాటు 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఎం.సాయివరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అమలాపురం రూరల్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పెన్షనర్ల సమస్యలను తక్షణం పరిష్కరించడంతో పాటు 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఎం.సాయివరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మధ్యంతర భృతిని మంజూరు చేయాలని కోరారు. పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో సాయివరప్రసాద్ అధ్యక్షతన నెలవారీ సమావేశం నిర్వహించారు. తొలుత రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్‌ఎస్ సీహెచ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఏడాది మొదటి రెండు నెలల్లో దాదాపు 400 మందికి డీఎల్సీలు అందించడం జరిగిందన్నారు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న సీనియర్ పెన్షనర్స్ ఇళ్లకు వెళ్లి 50మందికి లైఫ్ సర్టిఫికెట్లు చేయించామని వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు కార్యదర్శి నివేదికను, కోశాధికారి జయంతి సోమేశ్వరశర్మ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. అసోసియేషన్ సలహాదారు ఎస్.జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను విధివిధానాలు, పెన్షనర్ల సమస్యలను సమాధానాల రూపంలో సభ ముందుంచారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను తక్షణం విడుదల చేయాలన్నారు. సమావేశంలో పలు తీర్మాణాలను ఆమోదించారు. టీవీ శర్మ, పి.అర్జునుడు, పప్పుల శ్రీరామచంద్రమూర్తి, మండలీక ఆదినారాయణ, జి.భీమరాజు, మహబూత్ షాహీరా పాల్గొని మాట్లాడారు.