జస్టిస్ లలితకు పితృవియోగం
ABN , First Publish Date - 2020-09-13T07:31:45+05:30 IST
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత తండ్రి కొమ్మినేని అంకమ్మచౌదరి(70) కన్నుమూశారు.

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత తండ్రి కొమ్మినేని అంకమ్మచౌదరి(70) కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మం డలం చెరువుజమ్ములపాలెం. చెరువు మునసబుగా ఆ ప్రాంతంలో సుపరిచితులైన ఆయ న.. విజయవాడలోని తన నివాసంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు పలువురు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు. సాయంత్రం విజయవాడ బస్టాండ్ సమీప శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.