గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీపీగా పదోన్నతి
ABN , First Publish Date - 2020-12-30T08:27:18+05:30 IST
ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డీజీపీలుగా పదోన్నతి కల్పించింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఎం. గోపికృష్ణ, 1988 బ్యాచ్‌కు చెందిన జె. పూర్ణచంద్రరావుకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డీజీపీలుగా పదోన్నతి కల్పించింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఎం. గోపికృష్ణ, 1988 బ్యాచ్‌కు చెందిన జె. పూర్ణచంద్రరావుకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోపికృష్ణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా, పూర్ణచంద్రరావు ఏసీబీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఇతర విభాగాలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గోపికృష్ణ, పూర్ణచంద్రరావులు ప్రగతిభవవన్‌లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు.