కొత్త కోర్సులకు ఉన్నత విద్యాశాఖ రూపకల్పన: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2021-01-05T21:27:31+05:30 IST

కొత్త కోర్సులకు ఉన్నత విద్యాశాఖ రూపకల్పన: మంత్రి సురేష్

కొత్త కోర్సులకు ఉన్నత విద్యాశాఖ రూపకల్పన: మంత్రి సురేష్

అమరావతి: కొత్త కోర్సులకు ఉన్నత విద్యాశాఖ రూపకల్పన చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సు నేపథ్యంలో ఏడాది పీజీ కోర్సు ఉంటుందన్నారు. కళాశాలల్లో తనిఖీ కోసం క్వాలిటీ అసెస్‌మెంట్‌ సెల్‌ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అకడమిక్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో విద్యారంగం బలోపేతానికి ప్లానింగ్ బోర్డ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీలకు రీసెర్చ్‌ బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-05T21:27:31+05:30 IST