ఇలా ఉంటే రోగాలు రావా?

ABN , First Publish Date - 2021-04-08T05:40:30+05:30 IST

తాగునీటి పైపుల వాల్వ్‌ల్లోకి మురుగు నీరు కలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా అయితే రోగాలు రావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఉంటే రోగాలు రావా?
లీకేజీ నీటితో నిల్వ ఉన్న వాల్వు గుంత

  1.  తాగునీటిలోకి మురుగునీరు కలుషితం 
  2.  పట్టించుకోని పంచాయతీ అధికారులు 


మద్దికెర, ఏప్రిల్‌ 7: తాగునీటి పైపుల వాల్వ్‌ల్లోకి మురుగు నీరు కలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా అయితే రోగాలు రావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్దికెర గ్రామంలో 4 మంచి నీటి పథకాలు ఉన్నాయి. వీటికి దాదాపు 20 వాల్వు గుంతలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఊరి వాకిలి దగ్గర, మెయిన్‌ బజారు పక్కన, పంచాయతీ కార్యాలయం సమీపాన వాల్వు గుంతలలో  లీకేజీ నీరు నిలిచిపోయింది. చెత్తాచెదారంతో గుంతలు నిండిపోయాయి. ఇందులోని మురుగు నీరు కొళాయిల ద్వారా తాగునీరులో సరఫరా అవుతోంది. జిల్లాలో అతిసారా రోజురోజుకూ విజృంభిస్తున్నా మద్దికెర పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి శ్రీహరిని వివరణ కోరగా లీకేజీ సమస్య పరిష్కరించాలంటే నాలుగురోజులు నీటి సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని అన్నారు. సమయం చూసి మరమ్మతు చేయిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-04-08T05:40:30+05:30 IST