అభ్యర్థులకు RRB గుడ్‌న్యూస్.. దరఖాస్తు ఫీజు వాపస్.. సెప్టెంబర్ 7లోపే..

ABN , First Publish Date - 2021-09-01T20:03:41+05:30 IST

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. 35,280 పోస్టులకు సంబంధించి స్టేజ్ 1 సీబీటీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పలు కేటగిరీల్లో 35,280 పోస్టుల భర్తీ చేయడం 2019లో నోటిఫి

అభ్యర్థులకు RRB గుడ్‌న్యూస్.. దరఖాస్తు ఫీజు వాపస్.. సెప్టెంబర్ 7లోపే..

ఆంధ్రజ్యోతి ఎడ్యుకేషన్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. 35,280 పోస్టులకు సంబంధించి స్టేజ్ 1 సీబీటీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పలు కేటగిరీల్లో 35,280 పోస్టుల భర్తీ చేయడం 2019లో నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అదే ఏడాది మార్చిలో ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు రూ. 500  (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, మైనరిటీలు, తదితరలు రూ. 250) చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌(సీబీటీ)ను అదే ఏడాది (జూన్-సెప్టెంబర్) నిర్వహించాలని అధికారులు భావించినప్పటికీ పలు కారణాలతో పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత కరోనా విజృంభించడంతో దాదాపు ఏడాదిపాటు పరీక్షలను నిర్వహించలేదు. 



ఈ నేపథ్యంలోనే ఫేజ్‌ల వారీగా 2020 డిసెంబర్ నుంచి ఏడు విడుతల్లో దేశ వ్యాప్తంగా ఆయా పోస్టులకు ఫస్ట్ స్టేజ్ సీబీటీ పరీక్షలను నిర్వహించారు. దీంతో ఈ ఏడాది జూలైలో ఎగ్జామ్‌ల నిర్వహణ పూర్తైంది. ఈ క్రమంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం.. ఫీజు రీఫండ్ (ఎస్పీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ తదితరులకు పూర్తి డబ్బును, ఇతరలకు రూ.400) చెల్లించేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగానే ఫస్ట్ స్టేజ్ సీబీటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆర్ఆర్‌బీ వెబ్‌వైట్ ద్వారా ఫీజు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ గత నెలలో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తుది గడువు నిన్నటితో (ఆగస్టు 31) ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్‌బీ కీలక నిర్ణయం తీసుకుంది. గడువును సెప్టెంబర్ 7 వరకు పొడగిస్తున్నట్లు వెల్లడించింది. ఫీజు రీఫండ్ కోసం ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే.. అభ్యర్థులు https://rrbntpc.onlinereg.in/bankinfo3/al.aspx లింక్ ద్వారా ఫీజు రీఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి

ఐఐఎస్ఈఆర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. అర్హత బట్టి లక్షల్లో జీతాలు

ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం షాక్.. విధుల నుంచి తొలగింపు

Updated Date - 2021-09-01T20:03:41+05:30 IST

News Hub