RRB Jobs: పదోతరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. వేల ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:30 PM
RRB Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేష్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పుడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

RRB Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) వివిధ కేటగిరీల్లో 32,000 కు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అప్లికేషన్స్ జనవరి 23, 2025 నుంచే ప్రారంభమవగా.. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24. మొత్తం 32,438 పోస్టులు ఉండగా.. అభ్యర్థులు RRB ప్రాంతీయ వెబ్‌సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీటికి గల అర్హత ప్రమాణాలు ఏంటి, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను ఇక్కడ చూద్దాం.
అర్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI లేదా తత్సమానం లేదా NCVT మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రమాణాలు
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్స్‌లో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుము
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 500, SC, ST, Ex-Serviceman, PWBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఈ రుసుము రూ. 250.
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మొదట ఆన్‌లైన్ పరీక్ష స్టెజ్ 1 - CBT 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్ పరీక్ష స్టేజ్ 2 - CBT 2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆయా పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాసైన వారికి తర్వాత దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చివరకు వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
CEN నంబర్ 8/2024 ప్రకటన సంఖ్యను పరిశీలించాలి
ఆన్‌లైన్‌లో దరఖాస్తుపై క్లిక్ చేయండి
వ్యక్తిగత మొబైల్ నంబర్, మీ ఇమెయిల్ ఐడీని అందించడం ద్వారా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ఇందుకు అవసరమైన పేపర్లను అప్‌లోడ్ చేయండి, దరఖాస్తు రుసుం చెల్లించి సమర్పించాలి.
తీసుకున్న ప్రింటవుట్‌ను పరీక్ష తేదీ వరకు భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు.. ఈవెంట్స్ తేదీలు
దరఖాస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 23, 2025
దరఖాస్తుల ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2025
ముగింపు తేదీ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీ: ఫిబ్రవరి 22, 2025
అప్లికేషన్‌లో సవరణల కోసం: ఫిబ్రవరి 23 నుంచి 24 వరకు..
మరిన్ని వివరాలకు scr.indianrailways.gov.in అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.