Share News

Jobs: టెన్త్ ఉత్తీర్ణతతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-11-13T12:18:38+05:30 IST

మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: టెన్త్ ఉత్తీర్ణతతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

  • పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్‌మన్‌ కోటా

  • ఖాళీలు 1899

మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1,899(ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో 51; తెలంగాణ సర్కిల్‌లో 91 ఖాళీలు ఉన్నాయి)

1. పోస్టల్‌ అసిస్టెంట్‌: 598 పోస్టులు

2. సార్టింగ్‌ అసిస్టెంట్‌: 143 పోస్టులు

3. పోస్ట్‌మన్‌: 585 పోస్టులు

4. మెయిల్‌ గార్డ్‌: 3 పోస్టులు

5. ఎంటీఎస్‌: 570 పోస్టులు

అర్హత: పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ; పోస్ట్‌మన్‌/మెయిల్‌ గార్డ్‌ పోస్టులకు పన్నెండో తరగతి; ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, చెస్‌, ఫెన్సింగ్‌, గోల్ఫ్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, జూడో, కబడ్డీ తదితరాలు

వయోపరిమితి: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100. పోస్ట్‌మన్‌/మెయిల్‌ గార్డ్‌కు రూ.21,700 - రూ.69,100. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు రూ.18,000- రూ.56,900.

ఎంపిక ప్రక్రియ: క్రీడా విజయాలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: నవంబరు 10

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 9

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబరు 9

దరఖాస్తులో మార్పులకు అవకాశం: డిసెంబరు 10 నుంచి 14వ తేదీ వరకు

వెబ్‌సైట్‌: indiapost.gov.in/

Updated Date - 2023-11-13T12:18:39+05:30 IST