తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్ గెలవదు: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-06-25T19:30:09+05:30 IST
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి తీరుతోనే పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి తీరుతోనే పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ మద్దతుతోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతోందన్నారు. పాలమూరు జిల్లా వాసులను ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లతో తంతున్నాడని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపు తథ్యమన్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్ హుజురాబాద్‌లో గెలవలేదన్నారు. శాసనసభలో బీజేపీకి ఈటల రూపంలో మరో ఎమ్మెల్యే పెరగబోతున్నారని డీకే అరుణ తెలిపారు.