హన్మకొండ జూపార్కులో ఆడ చిరుతపులి మృతి
ABN , First Publish Date - 2021-01-10T04:56:20+05:30 IST
హన్మకొండ జూపార్కులో ఆడ చిరుతపులి మృతి

హన్మకొండ రూరల్, జనవరి 9: హన్మకొండ కాకతీయ జూపార్కులోని ఓ ఆడ చిరుత అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. జూపార్కులో ఒక మగ చిరుతపులి(దేవ), ఆడ చిరుతపులి(స్రవంతి) ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆడచిరుత కాలేయ వ్యాధితో బాధపడుతోంది. దీనికి చికిత్స అందిస్తున్న క్రమంలోనే శనివారం మృతి చెందింది. ఈ మేరకు జూపార్క్ వైద్యుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. చిరుతపులులు 12 నుంచి 17 యేళ్ల వరకే జీవిస్తాయని, ఈ జూపార్కులోని ఆడ చిరుత (స్రవంతి) 18 యేళ్ల వరకు జీవించిందని తెలిపారు. కాగా, మృతి చెందిన చిరుతకు పంచనామా చేసి దహనం చేశారు.