కహర్‌డుమ్లా పర్వతశ్రేణిని అధిరోహించిన యశ్వంత్
ABN , First Publish Date - 2021-07-22T05:51:25+05:30 IST
కహర్‌డుమ్లా పర్వతశ్రేణిని అధిరోహించిన యశ్వంత్

మరిపెడ రూరల్ (చిన్నగూడూరు), జూలై 21: జముకాశ్మీర్ లేహేలడక్ ప్రాంతంలోని ఆరువేల మీటర్ల ఎత్తైన కహర్‌డుమ్లా పర్వతశ్రేణిని బుధవారం మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన భూక్యా రామ్మూర్తి-జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్ అవలీలగా అధిరోహించారు. యశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహింపట్నంలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈయన సౌత్ అఫ్రికా టాంజినియాలోని కిలిమంజారో పర్యతశ్రేణిని అధిరోహించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 25న సౌత్‌అఫ్రికాకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో కోచ్‌లు రాకేశ్‌బాబు, పరమేశ్ యశ్వంత్‌తో మంచు పర్వతాలపై ఆయన తో బుధవారం రాక్ క్లైంబింగ్ ట్రయల్స్ చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి యశ్వంత్ కహర్‌డుమ్లా పర్వతశ్రేణి పైకి నిర్ణీత సమయానికన్న ముందే చేరుకున్నారు. ఆనందంతో త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ కేరింతలతో జేజేలు పలికారు. ఈ విషయం తెలిసి యశ్వంత్‌కు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదగిరిరెడ్డి, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, మరిపెడ మునిసిపల్ చైర్‌పర్సన్ సింధూరకుమారి అభినందనలు తెలిపారు. మరిపెడ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని వారు ఆకాంక్షించారు.