Jogi Ramesh: వారాహి మీద కాకుంటే వరాహం మీద తిరుగమనండి..

ABN , First Publish Date - 2022-12-19T15:37:23+05:30 IST

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Jogi Ramesh: వారాహి మీద కాకుంటే వరాహం మీద తిరుగమనండి..

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ పెట్టిన అధ్యక్షుడైనా సీఎం (CM) కావాలని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు (Chandrababu)ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌కు ధైర్యం వుంటే ఏపీలోని 175 నియోజకవర్గాలలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమని, పవన్ కళ్యాణ్ తిరుగుతుంటే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. వారాహి మీద కాకుంటే వరాహం మీద తిరుగాలంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వీరుడు, ధీరుడని.. ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం పవన్ కళ్యాణ్ కాదు కాదా.. ఆయన దత్తత తండ్రి చంద్రబాబు వల్ల కూడా కాదన్నారు. జగన్ కంచుకోటను ఇంచు కూడా ఎవరు కదల్చలేరని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-19T15:37:27+05:30 IST