శ్రీశైలంలో వైభవంగా లక్షదీపోత్సవం

ABN , First Publish Date - 2022-11-22T03:04:35+05:30 IST

శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

శ్రీశైలంలో వైభవంగా లక్షదీపోత్సవం

శ్రీశైలం, నవంబరు 21: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక చివరి సోమవారం పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతుల కార్యక్రమాలను దేవస్థానం వైభవంగా నిర్వహించింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలి రావడంతో క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. ఆకాశ దీపం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు.

Updated Date - 2022-11-22T03:04:36+05:30 IST