పశుసంవర్థక శాఖకు లోగో

ABN , First Publish Date - 2022-03-06T05:26:29+05:30 IST

పశుసంవర్థకశాఖకు ప్రత్యేక లోగోను రూపొందిస్తూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య జీవో నెంబరు 54ని జారీ చేశారు.

పశుసంవర్థక శాఖకు లోగో

 బొబ్బిలిరూరల్‌: పశుసంవర్థకశాఖకు ప్రత్యేక  లోగోను రూపొందిస్తూ  స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య  జీవో నెంబరు 54ని జారీ చేశారు.  ఈ మేరకు  శనివారం తమకు ఆ జీవో అందినట్లు స్థానిక పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. పశువుల దాణా దుకాణదారులంతా ఇకమీదట లైసెన్స్‌ ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.   లైఫ్‌టైమ్‌ లైసెన్స్‌ ఫీజు కింద రూ.25 వేలు చెల్లించాలన్నారు.  డివిజన్‌ పరిధిలో మొత్తం 35 దాణా దుకాణాలున్నాయన్నారు. ఇంతవరకు పది మంది లైసెన్స్‌ ఫీజులను చెల్లించారని చెప్పారు. దాణా తయారీ యూనిట్‌ నిర్వాహకులు సామర్థ్యాన్ని బట్టి రూ. 75 వేల నుంచి రూ.2  లక్షల  వరకు లైసెన్స్‌ ఫీజును చెల్లించాలని తెలిపారు. దాణా తయారీ యూనిట్‌ కోసం బాడంగి మండలం నుంచి ఒకరు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారని  చెప్పారు.


 

Updated Date - 2022-03-06T05:26:29+05:30 IST