27 నెలల కనిష్ఠానికి ఫారెక్స్ నిల్వలు
ABN , First Publish Date - 2022-10-29T00:20:02+05:30 IST
భారత విదేశీ మారక నిల్వలు 27 నెలల (2020 జూలై నాటి) కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం..

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు 27 నెలల (2020 జూలై నాటి) కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు మరో 450 కోట్ల డాలర్ల మేర తగ్గి 52,837 కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. గత ఏడాది అక్టోబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 64,500 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఆల్‌టైం రికార్డుతో పోలిస్తే ఇప్పటివరకు 11,663 కోట్ల డాలర్ల మేర క్షీణించాయి. పతనమవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ఆర్‌బీఐ మార్కెట్లోకి భారీగా డాలర్లను విడుదల చేయాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.