Cheetah: బళ్లారి కోట ప్రాంతంలో చిరుత సంచారం
ABN , First Publish Date - 2022-08-06T18:15:53+05:30 IST
నగరంలోని కోట సమీపంలో చిరుత(Cheetah) కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చిరుత ప్రత్యక్షం కావడంతో

బళ్లారి(బెంగళూరు), ఆగస్టు 5 : నగరంలోని కోట సమీపంలో చిరుత(Cheetah) కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చిరుత ప్రత్యక్షం కావడంతో నగరవాసులు భయాందోళనకు గురై తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని బోనులను ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ(Forest Department) అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. సమీప ప్రజలు చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. అధికారులు చిరుతను పట్టుకుని ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.