Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
ABN , Publish Date - Feb 28 , 2025 | 08:19 PM
కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిదండ్రులను కూడా వాడుకున్నారని పర్వేష్ వర్మ ఆరోపించారు. తన తండ్రి నడవగలిగినప్పటికీ కేవలం ఓట్ల కోసం ఆయనను వీల్‌చైర్‌లో తీసుకువచ్చారని చెప్పారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నాయకత్వంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరుపుతామని ఢిల్లీ కేబినెట్ మంత్రి పర్వేష్ వర్మ (Parvesh Verma) తెలిపారు. కేజ్రీవాల్ అవినీతి బహిర్గతమవుతుందని, ఆయన ఇక ఈ జన్మలో తీహార్ జైలు నుంచి తిరిగి వస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆప్ హయాంలో జరిగిన అవకతవలపై 'కాగ్' నివేదికలను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: ట్రాఫిక్ జామ్‌లు, చొరబాటుదార్లపై కొరడా.. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అమిత్‌షా సమీక్ష
ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదు, కానీ కీలకం..
ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కానప్పటికీ పాలనాపరంగా చాలా కీలకమని పర్వేష్ వర్మ తెలిపారు. ''ముఖ్యమంత్రి నేతృత్వంలో మేమంతా ఢిల్లీని అభివృద్ధి చేసి పూర్తిస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వం ఢిల్లీని లండన్‌గా మారుస్తామని హామీలిచ్చి, స్కూళ్లు, దేవాలయాలు, చివరికి శీష్ మహల్‌లోనూ లిక్కర్ దుకాణాలు తెరిచింది. అత్యంత విలాసవంతమైన కార్యాలయాలు నిర్మించారు, కానీ ఎవ్వరినీ లోపలికి అనుమతించ లేదు'' అని ఆయన అన్నారు.
తల్లిదండ్రులను కూడా వదల్లేదు..
కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిదండ్రులను కూడా వాడుకున్నారని పర్వేష్ వర్మ ఆరోపించారు. తన తండ్రి నడవగలిగినప్పటికీ కేవలం ఓట్ల కోసం ఆయనను వీల్‌చైర్‌లో తీసుకువచ్చారని చెప్పారు. ''ఎన్నికల కోసం కేవలం రెండు నెలల్లో ఢిల్లీని జాట్లు, బనీయాస్ అంటూ కులాల పేరుతో విడదీశారు. బెంగాలీ క్యాంపునకు నేను వెళ్లినప్పుడు మోనీ దాస్ అనే ఒక వితంతువు తన కుమారులిద్దరినీ మద్యం విధానంతో కేజ్రీవాల్ పొట్టనపెట్టుకున్నారని వాపోయింది. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి'' అని పర్వేష్ వర్మ చెప్పారు.
ప్రాంతాల పేర్లు మార్పుపై పర్వేష్ వర్మను అడిగినప్పుడు, పేర్లు మార్పే కాదు, సంస్కృతీ వారసత్వాన్ని కాపాడటం అనివార్యమని చెప్పారు. దురాక్రమణదారులు అనేక పేర్లు మార్చేశారని, వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ హయాంలో జరిగిన ప్రతి ఒక్క కుంభకోణంపై విచారణ జరుపుతామని, ఆయన హయాంలో ఒక్క బంగ్లాదేశీకి రేషన్ కార్డ్ జారీ చేసినట్టు గుర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Boat Fire Accident : మంటల్లో చిక్కుకున్న ఫిషింగ్ బోటు.. 20 మంది మత్స్యకారులు..
Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు
Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.