Chennai నుంచి కర్నూలుకు డైరెక్ట్ బస్సు
ABN , First Publish Date - 2022-06-30T15:21:08+05:30 IST
చెన్నై మాధవరం బస్టాండు నుంచి కర్నూలుకు డైరెక్ట్ బస్సును నడుపుతున్నట్లు ఏపీఎ్సఆర్టీసీ మాధవరం డిపో మేనేజర్ నవీన్‌కుమార్ తెలిపారు.

చెన్నై, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): చెన్నై మాధవరం బస్టాండు నుంచి కర్నూలుకు డైరెక్ట్ బస్సును నడుపుతున్నట్లు ఏపీఎ్సఆర్టీసీ మాధవరం డిపో మేనేజర్ నవీన్‌కుమార్ తెలిపారు. కొత్తగా ‘బైపాస్ రైడర్, ఇంద్ర’ ఏసీ సర్వీసును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు మాధవరం బస్టాండు నుంచి బయలుదేరే ఈ బస్సు తిరుపతికి వెళ్లకుండానే కడప, నంద్యాల మీదుగా కర్నూలు చేరుకుంటుందని, తద్వారా ప్రయాణీకులకు కనీసం గంట సమయం ఆదావుతుందని వివరించారు. అదే విధంగా ప్రతిరోజూ ఈ బస్సు రాత్రి 9 గంటలకు కర్నూలులో బయలుదేరుతుంది. చెన్నై నుంచి కర్నూలుకు రూ.950గా టిక్కెట్ ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
తిరుపతికి 15 నిమిషాలకొకటి..
మాధవరం బస్టాండు నుంచి ప్రతి పావుగంటకు తిరుపతికి బస్సు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సప్తగిరి, అలాట్ర్ డీలక్స్, గరుడ, అమరావతి, ఇంద్ర ఏసీ బస్సులు నడుతున్నామన్నారు. రాత్రి 1.15 గంటల వరకు తిరుపతి బస్సులు అందుబాటులో వుంటాయన్నారు.