Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
ABN , Publish Date - Mar 03 , 2025 | 02:13 AM
కేంద్ర మంత్రినైన తన కుమార్తెకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎలా అని ఆమె వాపోయారు. మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లాలోని ముక్తాయ్‌నగర్‌లో గత నెల 28న మహాశివరాత్రి సందర్భంగా సంత్‌ముక్తాయ్ యాత్ర నిర్వహించారు.

అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు
గత నెల 28న మహారాష్ట్రలోని సంత్ ముక్తాయ్ యాత్రలో ఘటన
ఠాణాలో మంత్రి ఫిర్యాదు.. 2 గంటలు కూర్చోబెట్టిన పోలీసులు
అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోవాలని సూచన
కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేకపోతే ఎలా అని రక్షా ఖడ్సే ఆవేదన
ముంబై, ఫిబ్రవరి 2: కేంద్ర యువజన, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెను పోకిరీలు వేఽఽధించారు. దీనిపై రక్షా ఖడ్సే స్వయంగా మక్తాయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రినైన తన కుమార్తెకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎలా అని ఆమె వాపోయారు. మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లాలోని ముక్తాయ్‌నగర్‌లో గత నెల 28న మహాశివరాత్రి సందర్భంగా సంత్‌ముక్తాయ్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొంటానని కుమార్తె కోరడంతో గుజరాత్ పర్యటనలో ఉన్న తాను సెక్యూరిటీనిచ్చి పంపినట్లు రక్షా ఖడ్సే తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా ఆకతాయిలు లెక్కచేయలేదు. రక్షా ఖడ్సే కుమార్తెను, ఆమె స్నేహితులను ఏడుగురు పోకిరీలు వెంబడించి వేధించారు. అనుచితంగా ప్రవర్తిస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు.
ఈ యువకులే గత నెల 24న కూడా తనను వేధించారని కుమార్తె చెప్పడంతో కేంద్ర మంత్రి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీసులు... అమ్మాయిల విషయం కావడంతో కేసు పెట్టే విషయంలో పునరాలోచించుకోవాలని సూచించినట్లు రక్షా ఖడ్సే మామ ఏక్‌నాథ్ ఖడ్సే తెలిపారు. నిందితులపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎట్టకేలకు పోలీసులు నిందితులపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి సోహమ్ అనే ఆకతాయిని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్
PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి
Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.