ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు.. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు

ABN , First Publish Date - 2022-11-19T19:21:08+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi liquor scam case)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు.. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు (Delhi liquor scam case)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ABN చేతికి చిక్కిన రిమాండ్ రిపోర్ట్‌లో విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి విషయాలు బయటపడ్డాయ. ఈడీ (ED)రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది. ఆప్ మంత్రి కైలాష్‌ గెహ్లాట్ నివాసంలోనే విజయ్‌నాయర్ బస చేశారని, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీగా అధికారులకు విజయ్‌నాయర్‌ పరిచయం చేసుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయ్‌నాయర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారని ఈడీ స్పష్టం చేసింది. విజయ్‌నాయర్, అభిషేక్‌కు మరో 5 రోజులపాటు ఈడీ కస్టడీ పొడిగించారు.

Updated Date - 2022-11-19T19:23:53+05:30 IST