సెమీస్‌లో యూపీ, బుల్స్‌

ABN , First Publish Date - 2022-02-22T09:12:16+05:30 IST

డుబ్కీకింగ్‌ పర్‌దీప్‌ నర్వాల్‌ సూపర్‌ ఫామ్‌తో.. యూపీ యోధను సెమీస్‌ చేర్చాడు. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధ 42-31తో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది.

సెమీస్‌లో యూపీ, బుల్స్‌

ప్లే ఆఫ్స్‌ కింగ్‌ పర్‌దీప్‌ నర్వాల్‌.. కేక పుట్టించాడు. లీగ్‌ ఆరంభంలో ఫామ్‌ కోసం తంటాలు పడిన నర్వాల్‌.. కీలక సమయంలో జోరు అందుకోవడంతో వార్‌ వన్‌సైడ్‌గా మారింది. పర్‌దీప్‌ హవాతో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసిన యూపీ సెమీస్‌ బెర్త్‌ను పట్టేసింది. మరో మ్యాచ్‌లో హై ఫ్లయర్‌ పవన్‌ కుమార్‌ అండ్‌ కో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో బెంగళూరు బుల్స్‌ ఫైనల్‌కు అడుగుదూరంలో నిలిచింది. 


పర్‌దీప్‌ వన్‌మ్యాన్‌ షో.. పుణెరి పల్టన్‌ చిత్తు

గుజరాత్‌పై బెంగళూరు గెలుపు

బెంగళూరు: డుబ్కీకింగ్‌ పర్‌దీప్‌ నర్వాల్‌ సూపర్‌ ఫామ్‌తో.. యూపీ యోధను సెమీస్‌ చేర్చాడు. సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధ 42-31తో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది. ఫైనల్లో చోటు కోసం పట్నా పైరేట్స్‌తో యూపీ తలపడనుంది. మ్యాచ్‌ ఆసాంతం చెలరేగిన పర్‌దీప్‌ 18 రైడ్‌ పాయింట్లు తీసుకురాగా.. డిఫెండర్‌ సుమీత్‌ హైఫైవ్‌ సాధించాడు. పుణె తరఫున అస్లాం ఇనామ్‌దార్‌ సూపర్‌-10 స్కోరు చేశాడు. ఎలిమినేటర్‌-2లో గుజరాత్‌ను 49-29తో చిత్తు చేసిన బెంగళూరు బుల్స్‌.. సెమీస్‌-2లో దబాంగ్‌ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది. 


ఎదురులేని పర్‌దీప్‌:

ఆరంభంలో పుణె జోరు ప్రదర్శిం చినా.. ఆ తర్వాత నర్వాల్‌ తుఫాన్‌ ముందు నిలవలేక పోయింది. ఐదు పాయింట్ల సూపర్‌ రైడ్‌తో యూపీని ఆధిక్యంలో నిలబెట్టిన పర్‌దీప్‌.. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. డిఫెన్స్‌లోనూ రాణించిన యూపీ.. 10వ నిమిషంలో పుణెను ఆలౌట్‌ చేసి 10-10తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మరోసారి పుణెను ఆలౌట్‌ చేసిన యూపీ 25-17తో ఫస్టాఫ్‌ను ముగించింది. ఇక, సెకండాఫ్‌లో ప్రత్యర్థి పుంజుకోకుండా పట్టుబిగించిన యోధ 35 నిమిషాల ఆట ముగిసేసరికి 38-28తో నిలిచింది. ఆఖరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 


దున్నేసిన బుల్స్‌..:

సమష్టిగా రాణించిన బెంగళూరు బుల్స్‌.. గుజరాత్‌పై విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ పట్టేసింది. స్టార్‌ రైడర్‌ పవన్‌ కుమార్‌ షెహ్రావత్‌ సూపర్‌-10తో అదరగొట్టగా.. చంద్రన్‌ రంజిత్‌, భరత్‌ చక్కని సహకారం అందించారు. బుల్స్‌ డిఫెన్స్‌ కూడా ఏమాత్రం తొందర పడకుండా ప్రత్యర్థి రైడర్లను టాకిల్‌ చేస్తూ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫస్టాఫ్‌ ముగిసే సరికి బెంగళూరు 31-19తో ముందంజలో ఉంది. 

Updated Date - 2022-02-22T09:12:16+05:30 IST