Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-10-31T08:52:15+05:30 IST

ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. గుడిహత్నూర్ మండలంలో సీతాగొంది దగ్గర కారు-కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. గుడిహత్నూర్ మండలంలో సీతాగొంది దగ్గర కారు-కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శంషోద్దిన్ (డ్రైవర్), సయ్యద్ రఫముల్లా అహ్మద్, శభియా హష్మీ, సయ్యద్ వజాహద్‎, మృతులంతా ఆదిలాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-10-31T08:58:19+05:30 IST