కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలు: లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-02-21T08:49:20+05:30 IST
సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుచేస్తామన్న కేసీఆర్... మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో సీఎంగా కొనసాగుతున్న ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అవడం వెనుక పరమార్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణలో ఎంఐఎంతో అధికారం పంచుకుంటూ, మరోవైపు మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాతో కొనసాగుతున్న శివసేనతో కేసీఆర్ జతకట్టడం ఎవరిని మోసం చేయడానికని ఆయన నిలదీశారు.