జ్ఞాపకశక్తిని పెంచేలా బోధన ఉండాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:20 AM
విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంచేలా నాణ్యమైన విద్యా బోధన అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం బీబీనగర్ మండలం జమీలాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సపోర్టుతో ఏర్పాటుచేసిన ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రామ్‌ను కలెక్టర్ ప్రారంభించారు.

కలెక్టర్ హనుమంతరావు
బీబీనగర్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంచేలా నాణ్యమైన విద్యా బోధన అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం బీబీనగర్ మండలం జమీలాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సపోర్టుతో ఏర్పాటుచేసిన ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రామ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధపెట్టి వినాలని, అప్పుడే బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోగలుగుతారని విద్యార్థులకు సూచించారు. చిన్ననాటినుంచే భవిష్యత్‌లో ఏం కావాలో లక్ష్యం పెట్టుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలుగుతామని విద్యార్థులకు చెప్పారు. గణిత శాస్త్రంలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన రాఖేశ్ అనే విద్యార్థిని కలెక్టర్ అభినందించారు. పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అంతకుముందు జమీలాపేట గ్రామానికి వెళ్తున్న కలెక్టర్ హనుమంతురావును రాయరావుపేట గ్రామస్థులు మార్గమధ్యంలో కలిసి తమ గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ గ్రామస్థులతో కలిసి గ్రామశివారులో రోడ్లపై పారుతున్న మురుగుకాల్వను పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు.
విద్యార్థులకు మెరుగైన విద్య
భువనగిరి రూరల్: 3,4, 5 తరగతుల్లో తెలుగు, ఆం గ్లం, గణితం సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు మె రుగైన విద్యనందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి తెలిపారు. భువనగిరి మండలం తుక్కాపురం ప్రాథమి క పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఐ కృత్రిమ మేధ ఆధారి త కంప్యూటర్ ప్రోగ్రామ్ ల్యాబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం పేరెంట్, టీచర్ సమావేశాలను నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ, పీఎస్ హెచ్‌ఎంలు రాఘవారెడ్డి, ఎన్.లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు జనార్థన్, సదానంద,బ్రహ్మచారి,బుచ్చిరెడ్డి,లక్ష్మణ్ బాబు, పద్మ, సునీత, పంచాయతీ కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు.