సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణకు డాక్టరేట్
ABN , First Publish Date - 2022-07-17T09:58:05+05:30 IST
తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద, గిరిజన విజ్ఞాన పీఠం డాక్టరేట్‌ను ప్రకటించింది.

హైదరాబాద్ సిటీ, జూలై16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద, గిరిజన విజ్ఞాన పీఠం డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆచార్య భట్టు రమేష్ పర్యవేక్షణలో ‘‘తెలుగు సినిమాల్లో జానపద కఽథాంశాలు - అధ్యయనం’’ అనే అంశంపై ఆయన పీహెచ్డీ పూర్తిచేశారు. తొంభై ఏళ్ల తెలుగు సినిమా ప్రస్థానంలో...‘గులేబకావళి’ నుంచి ‘బాహుబలి’ వరకు వచ్చిన అన్ని జానపద చలనచిత్రాలపై సమగ్రమైన పరిశోధన చేశారు. ఆ సినిమాల చిత్రీకరణలో వాడిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు 24క్రాఫ్టులకు సంబంధించిన అనేక అంశాల మీద ఈ అధ్యయనం సాగింది. ఈ నెల 20న జరిగే తెలుగు వర్సిటీ స్నాతకోత్సవంలో దీనిని ప్రదానం చేయనున్నారు.