మోదీ రావడానికి ముందు ఈడీ రావడం కామన్: కవిత
ABN , First Publish Date - 2022-12-01T10:30:31+05:30 IST
ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం కామన్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కవిత మాట్లాడారు.
Hyderabad : ప్రధాని మోదీ (PM Modi) రావడానికి ముందు ఈడీ (ED) రావడం కామన్ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కవిత మాట్లాడారు. బీజేపీ (BJP)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్నారు. 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణ (Telangana)లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. మోదీ వచ్చే ముందే రాష్ట్రానికి ఈడీ వచ్చిందన్నారు. తనపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారన్నారు. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని కవిత పేర్కొన్నారు. తనపై కేసులు రాజకీయ ఎత్తుగడే అన్నారు. ‘కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. భయపడేది లేదు’ అన్నారు. మీడియాకు లీకులిచ్చి తమ ఇమేజ్ను దెబ్బతీయలేరన్నారు. దర్యాప్తు సంస్థలు ప్రశ్నలు అడిగితే సమాధానమిస్తామన్నారు. ఈడీ, సీబీఐ, అన్నింటినీ ఎదుర్కొంటామన్నారు. మోదీకి పద్ధతి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈడీతో గెలవాలనుకుంటే తెలంగాణలో కుదరదన్నారు. ప్రజలు తమ వెంట ఉన్నంతకాలం తమకు ఇబ్బంది లేదని కవిత పేర్కొన్నారు.