ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP TDP Chief: అమిత్‌షా - లోకేష్ భేటీకి గల కారణాలు చెప్పిన అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-10-12T13:29:39+05:30

కేంద్రమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భేటీపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని వెల్లడించారు.

అమరావతి: కేంద్రమంత్రి అమిత్‌షాతో (Union Minister Amit Shah) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Amit Shah) భేటీపై అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని వెల్లడించారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలను తనకు తెలుసని అమిత్‌షా చెప్పారన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) అరెస్ట్ వెనుక తమ ప్రమేయం లేదని అమిత్ షా స్పష్టం చేశారన్నారు. లోకేష్, పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కలిసి అమిత్ షాని కలవలేదని.. లోకేష్ వెళ్లేసరికే ఆ పార్టీ అధ్యక్షులు అక్కడున్నారని చెప్పారు. లోకేష్ - అమిత్ షా భేటీ వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని అన్నారు. విశాఖకు తరలింపు అనే జీవో ఇస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని యెద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే ఏం తెలియదని అనుకుంటున్నారని.. వైజాగులో భూములను లాక్కోవడానికే జగన్ విశాఖ వస్తున్నారని అక్కడి ప్రజలకు తెలుసన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆపడానికి జగనేం చేశారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టుకైనా బడ్జెట్ కేటాయింపులు జరిపారా అని నిలదీశారు. రుషికొండ మీద ఓ ఇల్లు కట్టుకున్నారని.. జగన్ ఎంతుంటాడో తెలుసు.. ఆయనకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయన్నారు. చిన్నగా ఉండే ఈ మనిషికి ఇన్ని ఇళ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేదని తెలిపారు. జగన్ అరెస్ట్ అయితే వారి కుటుంబ సభ్యులే బయటకు వచ్చారని.. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్లెక్కారన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాజకీయ లబ్ది పొందాలనుకున్న జగన్ వ్యూహం బూం రాంగ్ అయిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ దద్దమ్మ మాటలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని.. కేంద్రమే అరెస్ట్ చేయించిందనే రీతిలో జగన్ మాట్లాడారని ఏపీ టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారు

మ్యానిపులేషన్‌తోనే ఎన్నికల్లో గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని తెలిపారు. ఏపీలో ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించడం.. చీల్చడం కోసం జగన్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలోని ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారన్నారు. పర్చూరు, తిరుపతిలో ఓట్ల అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. విచారణ ముందుకు సాగడం లేదన్నారు. పయ్యావుల కంప్లైంట్ మీద మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వలంటీర్లు ఫాం-6,7 పేర్లతో నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తున్నారన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా 57 మంది ఒక్కొక్కరూ వేయి అప్లికేషన్లు పెట్టారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాం-7 అప్లికేషన్లు దాఖలు చేసిన వారి వివరాలను జిల్లాల వారీగా ఇచ్చామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Updated Date - 2023-10-12T14:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising