ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APCC Chief: ‘త్వరలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ.. రాహుల్ హాజరు’

ABN, First Publish Date - 2023-04-26T12:05:38+05:30

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని.. సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామని.. సభకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరుకానున్నట్లు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (APCC Chief Gidugu Rudraraju) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. 1921 సంవత్సరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నవాళ్లకు మొన్న సభ కనువిప్పు కలిగిస్తుందని చెప్పారు. అన్ని జిలాల్లో ఇలాంటి సభలు నిర్వహిస్తామని అన్నారు. నియోజకవర్గం స్థాయిలో పార్టీ నేతలతో సమీక్ష చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు పూర్వ‌ వైభవం తెచ్చేలా పెద్దలతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో‌ మార్పుకి నాంది కానున్నాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలోని ‌12జిల్లాల్లో తెలుగు వాళ్ల‌ ప్రభావం ఉందని ఆయన అన్నారు.

ఏపీకి బీజేపీ (BJP) తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. విభజన చట్టంలో‌ ఉన్న అంశాలను అమలు‌చేయ లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులపై ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు. అనేక బిల్లులపై చట్టం చేసిన‌ బీజేపీ.. ఏపీ‌ విషయంలో మాత్రం మాట తప్పిందని విమర్శించారు. పోలవరం, హోదా, స్టీల్ ఫ్లాంట్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో మోదీ (PM Narendra Modi)ప్రజలను మోసం‌ చేశారన్నారు. తెలుగు ప్రజలంతా బీజేపీకి బుద్ది చెప్పేలా ఓడించాలని.. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఏపీలో భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి త్యాగ మూర్తి ఆంధ్రాబ్యాంకు స్థాపించారన్నారు. దేశ, విదేశాల్లో ఆంధ్రాబ్యాంకు‌ చూసి తెలుగు‌వాళ్లు గర్వ పడేవాళ్లని.. అటువంటి ఆంధ్రా బ్యాంకును‌ విలీనం చేసి చరిత్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది ప్రాభవం‌ కోసం పెత్తనం చేస్తున్నారన్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. రఘువీరా రెడ్డి, శైలజానాథ్, మస్తాన్‌వలీలకు కొన్ని ప్రాంతాల్లో బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. మే ఒకటి నుంచి కర్ణాటకలో ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ‘‘మోదీ మోసాలను‌ గుర్తించండి.. కాంగ్రెస్‌ను గెలిపించండి’’ అంటూ ఏపీసీసీచీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-26T12:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising