ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వస్తే పీజీ దాకా బస్ పాస్ ఫ్రీ

ABN, First Publish Date - 2023-03-01T14:22:37+05:30

టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే జనవరి 1, 2025న జాబ్ క్యాలెండర్ (Job calendar) విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నారా లోకేష్

పీజీ దాకా బస్ పాస్ ఫ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుపతి: టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే జనవరి 1, 2025న జాబ్ క్యాలెండర్ (Job calendar) విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నారా లోకేష్ (Nara Lokesh) హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువతతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు బస్సు పాస్ ఇస్తున్నారు.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పీజీ వరకు ఉచిత బస్సు పాస్ (Free bus pass) అందజేస్తాం. ఇక వసతి విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తాం. స్టేట్ బోర్డ్ సిలబస్ కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా మార్పు చేసి విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం. 31 రోజుల పాదయాత్రలో నాలో చాలా మార్పు వచ్చింది. పాలసీలు నాలుగు గోడల మధ్య తీసుకునేది కాదు. పాలసీల వల్ల ప్రజలకి చెడు జరగకుండా ఉండాలంటే ప్రజల మధ్య తీసుకోవాలి. కేజీ నుంచి పీజీ (KG to PG) వరకు మహిళను గౌరవించడం అనేది విద్యా బోధనలో భాగం కావాలి. అలాగే న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలి. న్యాయవ్యవస్థకి సరైన వసతులు బడ్జెట్ కేటాయింపుల్లో పెరిగితే త్వరగా న్యాయం జరుగుతుంది. న్యాయం త్వరగా జరగకూడదు అనే దురాలోచనతోనే జగన్ (jagan) కోర్టు కాంప్లెక్స్‌లో నిర్మాణాన్ని ఆపేశారు. జైలు జగన్ పోయి.. బ్రాండ్ బాబు (Chandrababu) రావాలంటే యువత ఓటు నమోదుపై దృష్టి పెట్టాలి.’’ అని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.

ఇది కూడా చదవండి: ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..

Updated Date - 2023-03-01T14:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!